China: పెళ్ళికాక ముందే బేబీ బంప్ ఫోటోషూట్...! 15 d ago
తల్లయ్యే విషయంలో ప్రతిక్షణం ప్రత్యేకమే అందుకే కొన్ని అపురూప క్షణాలని వేడుకగా జరుపుకుంటూ పది కాలాలపాటు మిగిలిపోయే జ్ఞాపకాలుగా మార్చుకోవాలని ప్రతి మహిళ ఆశిస్తుంది. దీనికి అనుగుణంగా ఉన్న ట్రెండు చాలామంది మహిళలు ఫాలో అవుతున్నారు గర్భం దాల్చాక బేబీ బంప్ తో ఫోటోలు తీసుకుని సంబరపడుతున్నారు. కానీ వీరికి భిన్నంగా చైనా యువతులు మాత్రం పెళ్లికి ముందు బేబీ బంప్ తో ఫోటో షూట్ చేసుకుంటున్నారట !
చైనాలో ఒక కొత్త ట్రెండును అనుసరించి చాలామంది యువతులు పెళ్లి కాకముందే బేబీ బంప్ తో ఫోటోషూట్లు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలు తాజాగా వివరించాయి. గార్భాధారణ సమయంలో ఒళ్ళు చేయడం వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఫోటోషూట్ సరిగా కుదరదని వారు భావించడమే దీనికి అసలు కారణమని తెలుస్తుంది. ఈ కారణంగా నాజూకైన శరీరం ఉండగానే ఫేక్ బెల్లీ (గర్భం ధరించినట్లుగా ఉండే కాస్ట్యూమ్ తో ) అక్కడి యువతులు ఫోటోషూట్ లు తీయించుకుంటున్నారని నివేదికలు వెల్లడించాయి.
చైనాకు చెందిన మెయిజీ గీజ్ అనే యువతి తన ఫేక్ బెల్లీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. నేను స్లిమ్ గా ఉన్నప్పుడే బేబీ బంప్ తో ఫోటో షూట్ చేసి గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె పేర్కొంది. పలువురు యువతులు సైతం ఆ ఫోటోలను పంచుకున్నారు. అయితే ఈ ట్రెండును కొంత మంది నెటిజెన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాము కూడా 70 ఏళ్ల పుట్టిన రోజువేడుకలను, అంత్యక్రియలుగా ఫోటోషూట్లు నిర్వహించుకోమంటావా అని ఎద్దేవా చేస్తున్నారు.